Thursday, 1 February 2024

నైపుణ్య విశ్వవిద్యాలయంగా రామానంద తీర్థ సంస్థ

 నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ యువజన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా




ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శనలు

 ఆర్మూర్ పట్టణ శివారులోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బుధవారం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని తెలంగాణ చారిత్రక కట్టడమైన గోల్కొండ కోట కేదార్నాథ్ గుడి పోస్ట్ ఆఫీస్ అయోధ్య రామ మందిరం ఆక్స్ఫర్డ్ పాఠశాల నమూనా గృహ అలంకరణ వస్తువులు అందంగా తయారుచేసి ప్రదర్శించారు కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిన ప్రతిభను సృజనాత్మకతను పెంపొందించడంలో వార్టెంట్ క్రాఫ్ట్ విద్య కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చిత్రలేఖనం చిత్రపటాలు గీయడం వంటి నైపుణ్యాలు పిల్లల్లో చిన్నతనం నుండే అలవర్చుకోవాలని అటువంటి నైపుణ్యాలు కలిగిన వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు ఇటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిర్మాణాలు చేసేటప్పుడు విద్యార్థుల్లో మానసిక వికాసం సామాజిక వికాసం పెంపొందుతుందని అన్నారు పిల్లలు తయారు చేసిన నిర్మాణాలను పరిశీలిస్తూ పాఠశాల పరిపాలన అధికారిని పద్మ మాట్లాడుతూ పిల్లల్లో గల సృజనాత్మకతను పెంచుకుంటూ వారి సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాల యాజమాన్యం డుతుందని అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు



క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఐ సి టి వర్క్ షాప్

 ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ పేపాల్ ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా ఐసిటీ వర్క్ షాపును బుధవారం ప్రారంభించారు ఈ వర్క్ షాప్ ఈనెల 24 వరకు జరగనుంది ఈ కార్యక్రమానికి ఐసిటీ అకాడమీకి చెందిన తెలంగాణ హెడ్ గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రధానోపాన్యాసం చేశారు ఆయన ప్రసంగిస్తూ ఐసిటీ పరిజ్ఞానంతో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎలా పొందవచ్చు విద్యార్థిలకు సోదాహరణంగా వివరించారు ఈ శిక్షణ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ టెక్నాలజీస్ టూర్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీ పట్ల లోతైన అవగాహనను పొందేందుకు ఐసిటి టెక్నాలజీ వంటి అంశాలపై వర్క్ షాప్ ఉపయోగపడుతుందని అన్నారు ప్రిన్సిపాల్ రామ్ కింకర్ పాండే మాట్లాడుతూ ఐసీటీలో అనేక ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని కాబట్టి విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని మరింత పరిజ్ఞానం నుండి పొందాలని తద్వారా ఉద్యోగం పొందడం చాలా సులభతరం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి ఐసిటీ అకాడమీ నుండి ధీరాజ్ సతీష్ కుమార్లు గౌస్ బాషా శిక్షకుల వ్యవహరించనున్నారు కార్యక్రమంలో టిపిఓ సునీల్ గట్టడి వివిధ విభాగాల అధిపతులు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



జర్మ ప్లాజంపై పరిశోధనలో ఎన్బిపిజిఆర్తో హార్టికల్చర్ వర్సిటీ ఒప్పందం

 హైదరాబాద్ ....మొక్కలపైన సమర్థవంతమైన పరిశోధన కోసం నేషనల్ బ్యూరో ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ న్యూఢిల్లీతో కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంతో ఉద్యానవన రంగంలో మొక్కల జన్యు వనరుల పైన వివిధ పంటల రకాల అభివృద్ధి కోసం పరిశోధనలు జరగనున్నాయని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ బి నీరజ ప్రభాకర్ చెప్పారు రైతుల ప్రయోజనం కోసం ఉద్యాన పంటల విశిష్ట రక్ష రకాల లక్షణాలను గుర్తించడం నూతన వంగడాలను విడుదల చేయడం వేగవంతం చేస్తామన్నారు వాతావరణన్ని తట్టుకుని ఉద్యాన రకాల మొక్కల విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రయోజనం కోసం శిక్షణకు కూడా ఒప్పందం అనుమతిస్తుందన్నారు ఉద్యాన విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఎన్విపిజిఆర్ శాస్త్రీయ సిబ్బంది మధ్య సహకార పరిశోధనలను ఈ ఒప్పందం సులభతరం చేస్తుందని చెప్పారు