హైదరాబాద్ ....మొక్కలపైన సమర్థవంతమైన పరిశోధన కోసం నేషనల్ బ్యూరో ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ న్యూఢిల్లీతో కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంతో ఉద్యానవన రంగంలో మొక్కల జన్యు వనరుల పైన వివిధ పంటల రకాల అభివృద్ధి కోసం పరిశోధనలు జరగనున్నాయని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ బి నీరజ ప్రభాకర్ చెప్పారు రైతుల ప్రయోజనం కోసం ఉద్యాన పంటల విశిష్ట రక్ష రకాల లక్షణాలను గుర్తించడం నూతన వంగడాలను విడుదల చేయడం వేగవంతం చేస్తామన్నారు వాతావరణన్ని తట్టుకుని ఉద్యాన రకాల మొక్కల విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రయోజనం కోసం శిక్షణకు కూడా ఒప్పందం అనుమతిస్తుందన్నారు ఉద్యాన విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఎన్విపిజిఆర్ శాస్త్రీయ సిబ్బంది మధ్య సహకార పరిశోధనలను ఈ ఒప్పందం సులభతరం చేస్తుందని చెప్పారు