Wednesday, 31 January 2024

ఇంటర్న్ షిప్ స్టైపెండ్ 10,000

 గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది సర్కారు కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది ఇంటర్ చదువుతున్న వారితో పాటు డ్రాప్ అవుట్ అయిన వారి కోసం వీటిని ఏర్పాటు చేసేందుకు సంస్థ చొరవ తీసుకున్నది ఎన్ఎస్డిసి ప్రతినిధులు ఇంటర్విద్య అధికారులను కలిసి నైపుణ్య శిక్షణ వివరాలను వెల్లడించారు ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆయా కాలేజీల్లో స్వల్పకాలిక వృత్తివిద్య కోర్సులను నిర్వహిస్తారు ఆయా కోర్సుల్లో చేరిన వారికి ఇంటర్షిప్ అప్రెంటిషిప్ కు అవకాశం కల్పిస్తారు ఇంటర్షిప్ కు ఎంపిక అయితే గరిష్టంగా 10,000 రూపాయల వరకు స్ట్రైపోయింది పారితోషికం లభిస్తుందని ఎన్ఎస్డిసి వర్గాలు అధికారులకు తెలిపాయి ఇటీ వారి కాలంలో నైపుణ్య శిక్షణ లేని తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కోర్సులు చదివిన పట్టాలు పుచ్చుకున్న ఉద్యోగాలు లభించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఏడాది ఆరు మాసాలు మూడు మాసాల వ్యవధిగల స్వల్పకాలిక కోర్సులను ఎన్ఎస్టిసి నిర్వహిస్తోంది ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో అప్రెంటిస్ట్ ఎంబిటెడ్ కోర్సులను ప్రవేశపెట్టారు రాష్ట్రంలోని 40 డిగ్రీ కాలేజీల్లో 15 కు పైగా కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి విద్యార్థులు ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు సంపాదిస్తున్నారు దీనికి కొనసాగింపుగా ఇంటర్ విద్యలోనూ ఇలాంటి కోర్సుల నిర్వహణకు ఎన్ఎస్డిసి ముందుకొచ్చింది ఈ కోర్సులను రాబోయే జూన్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరవచ్చు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ను జారీ చేస్తారు.