Tuesday, 30 January 2024

ఇందిరా గాంధీ ట్రైబల్ వర్సిటీలో హిందీ సర్టిఫికెట్ కోర్స్

 అమర్ కంటక్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కమ్యూనికేటు హిందీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది ప్రోగ్రాం వ్యవధి ఆరు నెలలు ఇందులో 30 సీట్లు ఉన్నాయి యూనివర్సిటీ నిర్వహించే ఆన్లైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు

అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూప్ తో ఇంటర్ 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కనీసం 45 శాతం మార్కులు తప్పనిసరి దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు కూడా అర్హులే హిందీ పై ఆసక్తి ఉన్నవారు రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ మెంబర్లు కూడా అప్లై చేసుకోవచ్చు

ఆన్లైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది జనరల్ నాలెడ్జ్ నుంచి 50 హిందీ లాంగ్వేజ్ నుంచి 30 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు రైటింగ్ స్కిల్స్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు ఇందులో అర్హత సాధించాలంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు కనీస 35 శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి

దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు వంద రూపాయలు దివ్యాంగులు ఓ బి సి ఎస్ సి ఎస్ టి అభ్యర్థులకు 50 రూపాయలు దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 19 ఆన్లైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ ఫిబ్రవరి 24 

వెబ్ సైట్..igntu.ac.in