తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో ఆరు నుంచి పదో తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది ప్రవేశ పరీక్షలు మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటి జేఈఈ నీట్ ఎంసెట్ సిఏ టి పి టి సి ఎస్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు
ప్రవేశాల వివరాలు తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అర్హత అడ్మిషన్ పొందాలనుకున్న విద్యార్థి 2023 24 విద్యా సంవత్సరానికి సంబంధిత తరగతికి కిందిస్థాయి తరగతి చదువుతూ ఉండాలి వయస్సు 31 824 నాటికి ఆరో తరగతికి పదేళ్లు ఏడో తరగతికి 11 ఏళ్లు ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు 9వ తరగతికి 13 ఏళ్లు పదో తరగతికి 14ఏళ్లు నిండాలి.
ఎంపిక విధానం ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది పరీక్ష సమయం రెండు గంటలు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22 2024 ప్రవేశ పరీక్ష జరుగుతేది 7 ఏప్రిల్ 2024 వెబ్ సైట్ www.tgtwgurukulam.telangana.gov.in